Authentic Chintapandu Pulihora Recipe | Temple-Style Tamarind Rice from Andhra & Telangana
📝 Introduction:
Chintapandu Pulihora, also known as Tamarind Rice, is a traditional South Indian rice
dish made with tangy tamarind extract, tempered spices, and cooked rice. It is a festive favorite,
commonly offered as prasadam in temples and prepared during special occasions like Ugadi, Dasara,
and Varamahalakshmi vratam. The unique combination of sour, spicy, and nutty flavors makes it a
comforting and satisfying meal.
Ingredients:
For the cooked rice:
- 1 cup rice (sona masuri or aged short-grain)
- Water & salt for boiling
- 1 tsp oil
- ½ tsp turmeric powder
For the tamarind pulusu (tamarind paste):
- ½ cup tamarind pulp (from ~½ lemon-size tamarind)
- 1–2 tsp jaggery (optional, to balance sourness)
- 3 green chilies, chopped
- Salt to taste
For tempering:
- 2 tbsp oil
- 1 tsp mustard seeds
- 1 tsp urad dal
- 2–3 tbsp chana dal
- 2 tbsp peanuts
- 2–3 dry red chilies
- A few curry leaves
- A pinch of asafoetida
- ¼ tsp turmeric
- (Optional) 1 tsp fennel or sesame seeds
⏱️ Cooking Time
- Cooking the rice : 15–20 minutes
- Preparing tamarind paste : 10 minutes
- Tempering & mixing : 5–7 minutes
- Total: 30 mins : 30–35 minutes
👩🍳 Instructions:
1. Cook & prep rice
Wash and pressure cook rice with oil, salt, and turmeric—ensure grains are fluffy, not mushy.
Spread to cool; gently fluff with a fork.
2. Make tamarind pulusu
Soak tamarind in warm water, extract pulp, then simmer with jaggery, green chilies, and salt until it thickens.
3. Prepare tempering
Heat oil; add peanuts, chana & urad dal, mustard, dry chilies, curry leaves, asafoetida,
turmeric, and optional seeds—fry until aromatic & lightly golden.
4. Assemble
Mix tamarind pulusu into cooled rice thoroughly, so each grain is coated.
Add tempering, toss gently but thoroughly to distribute flavors without breaking grains.
5. Serve
Best enjoyed at room temperature or slightly warm, often with papad or pickle.
It makes excellent prasadam or lunchbox food.
Cooking Tips:
1.Use aged rice (not newly-harvested) to achieve dry, separate grains.
2.Add a small amount of lemon juice if you want extra tanginess.
3.For nuttier flavor, include a teaspoon of fennel or sesame seeds in the tempering.
4.You can make the tamarind paste ahead and store in the fridge—it lasts for a few days.
ఆంధ్రా & తెలంగాణ స్పెషల్ చింతపండు పులిహోర | దేవాలయ శైలి సంప్రదాయ రుచి
(పరిచయం) :
చింతపండు పులిహోర అనేది దక్షిణ భారతదేశానికి చెందిన ఒక ప్రసిద్ధమైన రుచికరమైన అన్నం వంటకం.
చింతపండు, వేపిన పప్పులు, వేరుశెనగలు మరియు తాలింపు పదార్థాలతో ఈ వంటకం ప్రత్యేకంగా పుల్లగా,
తీపి-కారం మేళవింపుతో ఉంటుంది. ఇది ముఖ్యంగా పండుగలు, పూజలు, మరియు దేవాలయాలలో ప్రసాదంగా తయారు చేస్తారు.
అలసటగా ఉన్నప్పుడు కూడా త్వరగా తయారయ్యే ఈ వంటకం ప్రతి ఇంట్లో ప్రత్యేక స్థానాన్ని పొందింది.
కావలసిన పదార్థాలు:
అన్నం కోసం:
- బియ్యం – 1 కప్పు (సోనా మసూరి లేదా చిన్నగింజల బియ్యం)
- నీరు, ఉప్పు – తగినంత
- నూనె – 1 టీస్పూన్
- పసుపు – ½ టీస్పూన్
చింతపండు పులుసు కోసం:
- చింతపండు – ½ కప్పు (లేబు పరిమాణం అంత పులి తీసుకొని గుడ్డ వడకట్టి తీయాలి)
- బెల్లం – 1–2 టీస్పూన్లు (ఐచ్ఛికం – రుచి తేలికపరిచేందుకు)
- పచ్చిమిరపకాయలు – 3 (ముక్కలుగా కోయాలి)
- ఉప్పు – తగినంత
తాలింపు కోసం:
- నూనె – 2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు – 1 టీస్పూన్
- మినపప్పు – 1 టీస్పూన్
- శనగపప్పు – 2–3 టేబుల్ స్పూన్లు
- వేరుశెనగలు – 2 టేబుల్ స్పూన్లు
- ఎండు మిరపకాయలు – 2–3
- కరివేపాకు – కొద్దిగా
- ఇంగువ – ఒక చిటికె
- పసుపు – ¼ టీస్పూన్
- (ఐచ్ఛికం) నువ్వులు లేదా సోంపు – 1 టీస్పూన్
తయారుచేసే సమయం :
బియ్యం ఉడికించడానికి : 15–20 నిమిషాలు
చింతపండు పులుసు తయారీ : 10 నిమిషాలు
తాలింపు & కలపడం : 5–7 నిమిషాలు
మొత్తం సమయం : 30–35 నిమిషాలు
తయారీ విధానం:
1. అన్నం వండడం:
బియ్యం కడిగి కొద్దిగా నూనె, ఉప్పు, పసుపు వేసి వండాలి.
అన్నం గింజ గింజలా విడిగా ఉండాలి.
వండిన తర్వాత చల్లబరిచి అలా ఉంచాలి.
2. చింతపండు పులుసు తయారు చేయడం:
చింతపండును నీటిలో నానబెట్టి పక్కగా నూరి గుజ్జు తీయాలి.
దానిలో పచ్చిమిర్చి, బెల్లం, ఉప్పు వేసి మరిగించాలి.
ఇది చిక్కగా మారే వరకు మరిగించాలి.
3. తాలింపు:
పాన్‌లో నూనె వేసి వేడి చేయాలి.
మొదట వేరుశెనగలు, శనగపప్పు, మినపప్పు వేయాలి.
తరువాత ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి చిటపటలాడే వరకు వేయించాలి.
4. కలపడం:
అన్నంలో తాయారైన చింతపండు పులుసు వేసి మెల్లగా కలపాలి.
తాలింపు వేసి మళ్లీ మెల్లగా కలిపి మొత్తం బాగా కలిసేలా చూడాలి.
5. సర్వింగ్:
చింతపండు పులిహోరను కొద్దిగా చల్లగా లేదా గోరువెచ్చగా సర్వ్ చేయవచ్చు.
పక్కన అప్పడం, పెరుగు లేదా వడియాలతో సరదాగా తినొచ్చు.
టిప్స్(చిన్న చిట్కాలు):
1.బియ్యం గింజ గింజగా ఉండేలా ఉంచితే మంచి రుచి వస్తుంది.
2. కొంచెం నిమ్మరసం చినుకు వేసినా రుచి పెరుగుతుంది.
3. చింతపండు పులుసు ముందే తయారు చేసి ఫ్రిజ్‌లో రెండు రోజులు నిల్వ ఉంచవచ్చు.
4.శ్రీవారి ప్రసాదంగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది.
Leave a Comment